ఈ నెల 9న కేటీఆర్ రాక..!

by Ratna Kumari |

రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని ప్రజలు అప్పగిస్తే మోసం, దగా కోరు, చేతకాని పరిపాలన చేస్తున్న ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని మాజీ స్పీకర్, శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదన చారి అన్నారు.

ఈ నెల 9న కేటీఆర్ రాక..!
X

దిశ, పరకాల : రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని ప్రజలు అప్పగిస్తే మోసం, దగా కోరు, చేతకాని పరిపాలన చేస్తున్న ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని మాజీ స్పీకర్, శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదన చారి అన్నారు. శనివారం పట్టణంలోని లలిత కన్వెన్షన్ హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పరిపాలన ,చేతకాని పరిపాలనకు ఓట్లు వేసి ప్రజలు మోసపోతున్నారని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో పరకాల ఎంతో అభివృద్ధి సాధిస్తే నేటి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పాలనలో అభివృద్ధి కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలనలో పరకాలకు వందల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి శంకుస్థాపనలు చేస్తే నేటి ఎమ్మెల్యే వచ్చిన నిధులను పక్కనపెట్టి తన ఇష్టమైన రీతిలో మార్చుకుంటూ అభివృద్ధి శిలాఫలకాలు వేస్తున్నారని అన్నారు. రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కంటే పెద్ద మోసకారు ఎమ్మెల్యే రేవూరి అని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ కారు కనపడిన ఓట్లు వేయాలని ప్రజలను కోరారు. ఈనెల 9న పరకాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా టిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నట్లు తెలుపుతూ ఉదయం 11:30 నుంచి స్థానిక బస్టాండ్ కూడలి నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం సమావేశం పాల్గొని మాట్లాడుతారని అన్నారు. అధికారంలో ఉన్న పార్టీకి బాధ్యత ఉండాలి తప్ప కక్షపూత ధోరణి ఉండకూడదని అన్నారు. ఎన్ని గంటలైనా కేసర్ పాలన గురించి చెప్పుకోవచ్చని.. కాంగ్రెస్ లోకి అధికారం వచ్చాక బీసీల 42 శాతం ఏమైంది..? ఆడపడుచులకు 2500 ఎక్కడ, కళ్యాణ్ లక్ష్మి బంగారం ఏమైందని ,కౌలు రైతులకు రైతుబంధుస్తానని మాయమాటలు చెబుతూ విద్యార్థులకు స్కూటర్లు ఎక్కడని నిలదీశారు. రెసిడెన్షియల్ విద్యార్థులకు కల్తీ పాలు, పాముకాట్లతో విద్యార్థులు చనిపోతున్న పట్టింపు లేని ప్రభుత్వాన్ని మున్సిపల్ ఎన్నికల్లో తన గుణపాఠం చెప్పాలని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, వార్డు స‌భ్యులు పాల్గొన్నారు.

Next Story