- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీరుకుళ్ళ గ్రామంలో గుడుంబా రైడ్.. మహిళ అరెస్ట్..
by Bhanu |
హనుమకొండ జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని నీరుకుళ్ళ గ్రామంలో అక్రమంగా గుడుంబా అమ్ముతున్న మహిళను పోలీసులు మంగళవారం పట్టుకున్నారు.

X
దిశ, హనుమకొండ : హనుమకొండ జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని నీరుకుళ్ళ గ్రామంలో అక్రమంగా గుడుంబా అమ్ముతున్న మహిళను పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. నీరుకుళ్ళ గ్రామానికి చెందిన ఓ మహిళ తన నివాసంలో గుడుంబా తయారీ చేసి విక్రయించుచున్నదని సమాచారం మేరకు, ఆత్మకూర్ పోలీసులు ఆమె ఇంటిపై రైడ్ నిర్వహించారు. చేపట్టిన తనిఖీల్లో ప్రతి ప్యాకెట్ 2 లీటర్లుగా 16 గుడుంబా ప్యాకెట్లు (మొత్తం 32 లీటర్లు) స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ. 6,400 గా అంచనా వేయబడింది. సంఘటన స్థలంలోనే పంచనామ నిర్వహించిన అనంతరం, అట్టి మహిళను అరెస్ట్ చేసి, ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Next Story






