యువ పాటల రచయిత మ్యాదరి సునీల్‌కు నంది అవార్డు

by Nallavelli.Anjaneyulu |

మండలంలోని జూకల్ గ్రామానికి చెందిన, యువ పాటల రచయిత మ్యాదరి సునీల్ కి నంది అవార్డు దక్కింది.

యువ పాటల రచయిత మ్యాదరి సునీల్‌కు నంది అవార్డు
X

దిశ, చిట్యాల : మండలంలోని జూకల్ గ్రామానికి చెందిన, యువ పాటల రచయిత మ్యాదరి సునీల్ కి నంది అవార్డు దక్కింది. తను రచించిన పలు పాటలను గుర్తించిన, మెగా హెల్పింగ్ పౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక నంది అవార్డు ప్రకటించారు. ఈ అవార్డును ఫౌండేషన్ డైరెక్టర్ శిరీష్ రెడ్డి ప్రకటించారు. గురువారం హైదరాబాద్ జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ సినీనటుడు, కమెడియన్ బాబు మోహన్ చేతుల మీదుగా మ్యాదరి సునీల్ కి నంది అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ ఇంత గొప్ప గౌరవానికి తనను ఎంపిక చేసిన ఫౌండేషన్ డైరెక్టర్ శిరీష్ రెడ్డి కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Next Story