Naini Rajender Reddy : ఆగస్టు చివరిలోగా అందుబాటులోకి నాయిమ్ నగర్ బ్రిడ్జి

by Sridhar Babu |

నయీమ్ నగర్ బ్రిడ్జి (పెద్ద మోరి ) పనులు చివరి దశకు చేరుకున్నాయని వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.

Naini Rajender Reddy : ఆగస్టు చివరిలోగా అందుబాటులోకి నాయిమ్ నగర్ బ్రిడ్జి
X

దిశ, హనుమకొండ టౌన్ : నయీమ్ నగర్ బ్రిడ్జి (పెద్ద మోరి ) పనులు చివరి దశకు చేరుకున్నాయని వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు. రెండవ దశ పనులు పూర్తి కావచ్చాయని, ఆగస్టు చివరికల్లా రవాణాకు సిద్ధంగా బ్రిడ్జి వస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పటికి రెండవ దశ బ్రిడ్జి పనులు కూడా పూర్తి కావచ్చాయని చివరి దశ బ్రిడ్జి పనులు పూర్థయిన క్రమంలో ప్రజలకు అందుబాటులోకి వస్తుందని అన్నారు. బ్రిడ్జి నిర్మాణ పనుల్లో నాణ్యత పరమైన ప్రమాణాలను

పాటిస్తూ నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు. చిరకాల కోరికగా ఉన్న పెద్దమోరి నిర్మాణం ద్వారా ప్రధాన రహదారికి, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కలుగుతున్నాయని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. తేలికపాటి వర్షాలకు సైతం పెద్ద మోరీ వలన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కోతలకు గురైన ప్రదేశాలను , అక్రమ నిర్మాణాలను కూల్చే పనులు జరుగుతున్నాయని తెలిపారు. వచ్చే వర్షాకాలం నాటికి ప్రజా రవాణాకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని తెలిపారు.

Next Story