- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొడుకులు పట్టించుకోవడం లేదు ఆదుకోండి సార్..
ముగ్గురు కొడుకులు తమను పట్టించుకోకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామంటూ జిల్లా కేంద్రానికి చెందిన ఇద్దరు వృద్ధులు కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు.

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి: నడవలేని పరిస్థితిలో ఉన్నాం.. ముగ్గురు కొడుకులు తమను పట్టించుకోకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామంటూ జిల్లా కేంద్రానికి చెందిన ఇద్దరు వృద్ధులు కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన వారికి సమయం లేకపోవడంతో కలెక్టర్ కు వినతిపత్రం ఇవ్వడానికి కార్యాలయం చేరుకున్నారు. వివరాల్లోకి వెళితే.. జిల్లా కేంద్రానికి చెందిన బత్తిని ఐలయ్య, సమ్మక్కకు ముగ్గురు కుమారులు ఉండగా.. వారిలో ఇద్దరికీ వివాహం చేసి అయిలయ్యకు గల నాలుగు ఎకరాల పొలంలో ఒక్కొక్కరికి ఎకరం పంపిణీ చేసి 30 గుంటల పొలాన్ని వృద్ధులు ఉంచుకోగా, పెద్ద కుమారుడు ఐలు కోమురు గత కొద్ది సంవత్సరాలుగా తమ భూమిలో సాగు చేసుకుంటూ ఇబ్బందికి గురి చేస్తున్నాడని కన్నీటి పర్వతమయ్యారు. తమ కుమారులు తమను పట్టించుకోవడం లేదని అధికారులు తమ భూమి తమకే దక్కే విధంగా చూడాలని వారు వేడుకుంటున్నారు.






