జనగామలో ముత్తిరెడ్డి అర్ధ నగ్న ప్రదర్శన

by Disha Web Desk 20 |
జనగామలో ముత్తిరెడ్డి అర్ధ నగ్న ప్రదర్శన
X

దిశ, జనగామ: జనగామలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి శనివారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అర్ధనగ్నప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్ రెడ్డి పై ఆవాకులు చెవాకుల పేల్చారు. జనగామ నియోజకవర్గంలో దళితుల పై పల్లా కేసులు పెట్టించేందుకు తన అనుచరులను పురామయిస్తున్నాడని ఆరోపించారు.

అయితే, గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించే విషయంలో అధిష్టానం పెండింగ్ లో పెట్టిన విషయం విధితమే. దీంతో ముత్తిరెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డిల మధ్య ఉప్పు, నిప్పు పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు పల్లారాజేశ్వర్ రెడ్డి ప్రత్యక్షంగా ఎక్కడ మాట్లాడకపోయినప్పటికీ, ముత్తిరెడ్డి మాత్రం పల్లాపై అనేకసార్లు విమర్శలు చేస్తుండడం తెలిసిందే. దీంతో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం టికెట్ కేటాయింపు పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. అప్పటివరకు ముత్తిరెడ్డి, పల్ల పై ఇదే మాదిరి ఆరోపణలు కొనసాగుతూనే ఉంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.

Next Story