సుమలత హత్య కేసులో నిందితుడి అరెస్టు

by Bhanu |

మండలంలోని గట్ల నర్సింగాపూర్‌ గ్రామంలో జూన్ 5న జరిగిన కోల సుమలత హత్య కేసులో గ్రామానికి చెందిన గుళ్ళ రాజును సోమవారం రోజున ఆ ఊరి కమాన్ వద్ద దొరకడంతో అరెస్టు చేసినట్లు కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్ రెడ్డి తెలిపారు.

సుమలత హత్య కేసులో నిందితుడి అరెస్టు
X

దిశ, భీమదేవరపల్లి : మండలంలోని గట్ల నర్సింగాపూర్‌ గ్రామంలో జూన్ 5న జరిగిన కోల సుమలత హత్య కేసులో గ్రామానికి చెందిన గుళ్ళ రాజును సోమవారం రోజున ఆ ఊరి కమాన్ వద్ద దొరకడంతో అరెస్టు చేసినట్లు కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మూడేళ్లుగా కుటుంబ వివాదాల నేపథ్యంలో కేసుల్లో ప్రధాన సాక్షిగా ఉన్న కోల సుమలతను హత్య చేస్తే శిక్ష తప్పుతుందని భావించిన రాజు, గొడ్డలితో తలపై దాడి చేసి ఆమెను దారుణంగా హత్య చేసి మృతురాలి ఫోన్ తీసుకొని పరారైయ్యాడు.

అయితే హత్య చేసి పారిపోతూ కమాన్ వద్ద దొరకడంతో అరెస్టు చేశామని ఆయన తెలిపారు. డీసీపీ సలీమా ఆదేశాల మేరకు ఏసీపీ నేతృత్వంలో సిఐ పులి రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటైన మూడు ప్రత్యేక బృందాలు ముల్కనూర్ శివారులో నిందితుడిని పట్టుకున్నారు. హత్యకు ఉపయోగించిన గొడ్డలి, సెల్‌ఫోన్, ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు ఛేదనలో కీలక పాత్ర పోషించిన ఎల్కతుర్తి సీఐ పులి రమేష్, ముల్కనూర్ ఎస్సై సాయిబాబు, వంగర ఎస్సై దివ్యలను ఏసీపీ ప్రశాంత్ రెడ్డి ప్రశంసించారు.

Next Story