'కోట'లో మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు

by Ratna Kumari |

జిల్లాలోని మహబూబాబాద్, కేసముద్రం,డోర్నకల్, మరిపెడ తొర్రూర్ మున్సిపాలిటీల్లో 98 వార్డులకు ఆయా జనాభా ప్రాతిపదికన ఎస్సీ,ఎస్టీ,బీసీ,జనరల్ వారిగా రిజర్వేషన్లను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది.

కోటలో మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు
X

దిశ, మహబూబాబాద్ : జిల్లాలోని మహబూబాబాద్, కేసముద్రం,డోర్నకల్, మరిపెడ తొర్రూర్ మున్సిపాలిటీల్లో 98 వార్డులకు ఆయా జనాభా ప్రాతిపదికన ఎస్సీ,ఎస్టీ,బీసీ,జనరల్ వారిగా రిజర్వేషన్లను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. అదేవిధంగా 2019 మున్సిపాలిటీ చట్టం ప్రకారం జనరల్ మహిళకు పెద్దపీట వేయాగా.. ఈనెల 18 లోపు వార్డులకు రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు తెలుస్తుంది.ఇది ఇలా ఉంటే మరిపెడ, డోర్నకల్ పురపాలకల ల్లో బీసీలకు మొండి చేయి చూపారంటూ బీసీ సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ మాత్రం బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం.. కట్టుబడి ఉన్నామని జనరల్ స్థానాల్లో ఖచ్చితంగా బీసీలకే ప్రాధాన్యత ఇస్తామంటూ ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

జిల్లాల్లోని మున్సిపాలిటీల వారిగా రిజర్వేషన్ల వివ‌రాలు :

మహబూబాబాద్ మున్సిపాలిటీలో..

మ‌హ‌బూబ్ బాద్ మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులు క‌ల‌వు. ఎస్టీ జనరల్ 4, ఎస్టీ మహిళ 3, ఎస్సీ జనరల్ 3, ఎస్సీ మహిళ 2, బీసీ జనరల్ 3, బీసీ మహిళ 3, జనరల్ మహిళ 10, జనరల్ రిజర్వుడ్ 8 స్థానాలు కేటాయించారు.

కేసముద్రం మున్సిపాలిటీలో..


కే స‌ముద్రం మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులు క‌ల‌వు. ఎస్టీ మహిళ 1, ఎస్టీ జనరల్ 2, ఎస్సీ జనరల్ 1, ఎస్సీ మహిళ 1, బీసీ జనరల్ 2, బీసీ మహిళ 1, జనరల్ మహిళ 5, జనరల్ 3 స్థానాలు కేటాయించారు.

డోర్నకల్ మున్సిపాలిటీలో..


డోర్న‌క‌ల్ మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులు క‌ల‌వు. ఎస్టీ మహిళ 2, ఎస్టీ జనరల్ 2, ఎస్సీ జనరల్ 2, ఎస్సీ మహిళ 1, జనరల్ మహిళ 4, జనరల్ 4 స్థానాలు కేటాయించాగా బీసీలకు సున్న.

మరిపెడ మున్సిపాలిటీలో..


మ‌రిపెడ మున్సిపాలిటీ ప‌రిధిలో మొత్తం 15 వార్డులు క‌ల‌వు. వాటిలో ఎస్టీ మహిళ 3, ఎస్టీ జనరల్ 3, ఎస్సీ జన రల్ 1, జనరల్ మహిళ 4, జనరల్ 4 స్థానాలు కేటాయించాగా బీసీలకు సున్న.

తొర్రూరు మున్సిపాలిటీలో...

తొర్రూర్ మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులు క‌ల‌వు. ఎస్టీ జనరల్ 1, ఎస్టీ మహిళ 1, ఎస్సీ జనరల్ 2, ఎస్సీ మహిళ 1, బీసీ జనరల్ 2, బీసీ మహిళ 1, జనరల్ మహిళ 5, జనరల్ 3 స్థానాలు కేటాయించారు.

Next Story