ములుగు జడ్పీ చైర్మన్‌కి గుండెపోటు

by Malleboina Mahesh |

ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్‌కు శనివారం ఉదయం తన నివాసంలో ఉండగా ఒక్కసారిగా ఛాతిలో తీవ్రమైన నొప్పి రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు.

ములుగు జడ్పీ చైర్మన్‌కి గుండెపోటు
X

దిశ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్‌కు శనివారం ఉదయం తన నివాసంలో ఉండగా ఒక్కసారిగా ఛాతిలో తీవ్రమైన నొప్పి రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. కుసుమ జగదీష్ ఆ సమయంలో తన నివాసంలోనే ఉండటంతో అతని భార్య రమాదేవి వెంటనే సీపీఆర్ చేసింది. అనంతరం హుటాహుటిన దగ్గరలోని అజర ఆస్పటల్‌లో చికిత్స నిమిత్తం తరలించారు. పరీక్షించిన వైద్యులు చిన్నపాటి గుండెపోటు వల్లనే ఛాతిలో నొప్పి కలిగిందని వెల్లడించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో అత్యవసర చికిత్స అందుతుందని డాక్టర్లు తెలిపారు.

Next Story