- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు ములుగులో మంత్రుల పర్యటన
రాష్ట్ర ప్రభుత్వం పేదింటి సొంత ఇంటి కలలు నెరవేర్చే దిశగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇడ్ల పథకంలోని లబ్ధిదారులకు రేపు ములుగు మండలంలోని ఇంచర్లలోని ఎంఆర్ ఫంక్షన్ హాల్ వద్ద భారీ స్థాయిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు.

దిశ, ములుగు ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం పేదింటి సొంత ఇంటి కలలు నెరవేర్చే దిశగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇడ్ల పథకంలోని లబ్ధిదారులకు రేపు ములుగు మండలంలోని ఇంచర్లలోని ఎంఆర్ ఫంక్షన్ హాల్ వద్ద భారీ స్థాయిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మరియు రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరుకానున్నారు.
ఈ సందర్భంగా ఎంపికైన లబ్ధిదారులకు వారి ఇంటి స్థలాలపై ఇళ్ల నిర్మాణానికి అవసరమైన పత్రాలను అధికారికంగా అందజేస్తారు.ఈ కార్యక్రమం అనంతరం, మంత్రులు ములుగు మండలం పత్తిపల్లి గ్రామంలో జరగనున్న రైతు సదస్సులో పాల్గొననున్నారు. ఈ సదస్సులో రైతుల సమస్యలు, సాగునీటి లభ్యత, ఎరువులు, విత్తనాల అందుబాటు తదితర అంశాలపై చర్చించనున్నారు. జిల్లా అధికారులు ఈ రెండు కార్యక్రమాలకు అవసరమైన భద్రతా మరియు సాంకేతిక ఏర్పాట్లను పూర్తిచేసినట్లు తెలిపారు.






