ఏసీబీకి చిక్కిన ములుగు డీఈవో పాణిని

by Bhanu |

ములుగు జిల్లా కేంద్రంలోని డీసిఈవో (జిల్లా విద్యా శాఖ అధికారి) కార్యాలయంలో ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాల్లో షాకింగ్ వాస్తవాలు వెలుగుచూశాయి.

ఏసీబీకి చిక్కిన ములుగు డీఈవో పాణిని
X

దిశ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా కేంద్రంలోని డీసిఈవో (జిల్లా విద్యా శాఖ అధికారి) కార్యాలయంలో ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాల్లో షాకింగ్ వాస్తవాలు వెలుగుచూశాయి. లంచం తీసుకుంటూ డీఈవో పాణిని, ఆయన సహచరుడు సీనియర్ అసిస్టెంట్ దిలీప్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికారు.

రూ.20,000 లంచం… ఏసీబీకి చిక్కిన అధికారులు.

కన్నాయిగూడెం మండలం లక్ష్మీపురం పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు సిక్ లీవ్ పూర్తయి మళ్లీ తన పోస్టింగ్ కోసం డీఈవో కార్యాలయాన్ని ఆశ్రయించాడు. అయితే ఆ ఉపాధ్యాయుడి ఫైల్‌ను ముందుకు కదపడానికి అధికారులు ఏకంగా రూ.20,000 లంచం డిమాండ్ చేసినట్టు సమాచారం. ఈ విషయాన్ని బాధిత ఉపాధ్యాయుడు ఏసీబీకి ఫిర్యాదు చేయగా, ఏసీబీ అధికారులు ముందస్తుగా పథకం వేసి రెడ్‌హ్యాండెడ్‌గా అధికారులు లంచం తీసుకుంటూ పట్టుకున్నారు. ములుగు డీఈవో పాణిని 20000, ఆయన సహచరుడు సీనియర్ అసిస్టెంట్ దిలీప్ 5000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

విద్యా శాఖలో కలకలం..

డీఈవో పాణిని లంచం కేసులో పట్టుబడటంతో జిల్లా విద్యా శాఖలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేయాల్సిన అధికారులు ఇలా లంచాల కుంభకోణాల్లో పడటం పై జిల్లా వాసులు ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పట్టుబడిన డీఈవో పాణిని, సీనియర్ అసిస్టెంట్‌ దిలీప్ ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. మరికొన్ని కీలక ఆధారాలు సేకరించడానికి ఏసీబీ బృందం కార్యాలయంలో తనిఖీలు కొనసాగిస్తోంది.

Next Story