మరణంలో కూడా వీడని భార్యాభర్తల బంధం.. భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్య

by Bhanu |

ములుగు జిల్లా మల్లంపల్లి మండలం శివతాండ గ్రామంలో హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది.

మరణంలో కూడా వీడని భార్యాభర్తల బంధం.. భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్య
X

దిశ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా మల్లంపల్లి మండలం శివతాండ గ్రామంలో హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సభావతి సుగుణ పురుగుల మందు తాగి మృతి చెందగా, భార్య మరణాన్ని తట్టుకోలేని భర్త సభావతి పంతులు కూడా అదే బాటలో పురుగుల మందు తాగి మరణించాడు. ఒక్కరోజులో ఒకే కుటుంబంలో ఇద్దరి మృతితో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఇప్పటికే ఈ దంపతులు గత ఆరు నెలలలో తమ ఇద్దరు కుమారులను కోల్పోయిన సంగతి స్థానికులు గుర్తుచేస్తూ, శోకసంద్రంలో శివ తండా గ్రామం మునిగిపోయింది.

Next Story