- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కురవి పెద్ద చెరువు పై "మృగశిర" ఎఫెక్ట్
సాధారణంగా మృగశిర కార్తె రోజు చేపలు తినడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో కార్తె రోజు చేపల కోసం జనాలు చెరువులు, మార్కెట్ల వద్ద భారీగా క్యూ కడుతుంటారు.

దిశ, మరిపెడ(కురవి): సాధారణంగా మృగశిర కార్తె రోజు చేపలు తినడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో కార్తె రోజు చేపల కోసం జనాలు చెరువులు, మార్కెట్ల వద్ద భారీగా క్యూ కడుతుంటారు. సోమవారం మృగశిర కార్తె రావడంతో మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని పెద్ద చెరువు లూటి పోయిందన్న వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దీంతో వందలాదిగా జనం చేపల కోసం చెరువులో ఎగబడ్డారు. ఒక్కసారిగా తండోపతండాలుగా జనం రావడంతో మత్స్యకారులు ఆశ్చర్యానికి లోనయ్యారు. కొరివికి చుట్టుపక్కల సుమారు 30 కిలోమీటర్ల దూరం నుంచి సైతం ప్రజలు చేపల వేటకు వందలాదిగా తరలిరావడంతో మత్స్య సొసైటీ వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్సై బొలగాని సతీష్ బృందంతో చెరువు వద్దకు వెళ్లి పలువురి వద్ద తనిఖీ చేసి చేపలు పట్టేందుకు వచ్చిన పలువురి బైకులను వాహనంలో పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం ముందు రోజే చెరువులోని చేపలు మత్స్య కారులు పట్టేయడంతో విలువైన మత్స్య సంపద చెరువులో లేదని గుర్తించినట్లు ఎస్సై తెలిపారు. ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు రాలేదని, దీంతో ఎవరి వాహనాలు వారికి అప్పగించినట్లు ఎస్సై తెలిపారు.






