ఇచ్చిన హామీ నిలబెట్టుకోకుంటే ఉద్యమ కార్యాచరణ

by Ratna Kumari |

పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పుల్లం దామోదర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ప్రకటించిన పథకాలను వెంటనే అమలు చేయాలని కోరారు.

ఇచ్చిన హామీ నిలబెట్టుకోకుంటే ఉద్యమ కార్యాచరణ
X

దిశ, హన్మకొండ టౌన్ : పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పుల్లం దామోదర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ప్రకటించిన పథకాలను వెంటనే అమలు చేయాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా వేతన సవరణ ప్రకటన, హెల్త్కేర్డులు మరియు కోటి రూపాయల ప్రమాద బీమా పథకాలను అమలుపరుస్తూ ప్రకటించకపోతే ఉద్యోగుల ఆగ్రహానికి గురికావలసి వస్తుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి ఎన్నో హామీలను పొందుపరచిందని, కానీ రెండున్నర సంవత్సరాలుగా అమలుకు మాత్రం నోచుకోవడం లేదని తెలిపారు.


ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగ, ఉపాధ్యాయుల జేఏసీతో సమావేశం నిర్వహించి వేతన సవరణ హెల్త్ కార్డులు జూన్ 2 నుంచి అమలుచేస్తామని మాట ఇచ్చారని తెలిపారు. అదేవిధంగా ఉద్యోగ విరమణ పొందినవారికి రావలసిన బకాయిలను 100 రోజుల్లో చెల్లిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఈ హామీలన్నీ నిలబెట్టుకోకపోతే పీఆర్టీయూ తరఫున ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి సుంకరి బిక్షంగౌడ్, మాజీ ఎమ్మెల్సీ మోహన్రెడ్డి, మాజీ అధ్యక్షుడు పి. వెంకటరెడ్డి, గుండు లక్ష్మణ్, పత్రిక ప్రధాన సంపాదకులు జగన్మోహన్ గుప్త, ఆడిట్ కమిటీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

Next Story