- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Medaram Jatara 2026 : బైలెల్లిన సమ్మక్క తల్లి.. దద్దరిల్లిన మేడారం
by Taduka Kalyani |
మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరలో కీలక ఘట్టంగా, చిలకలగుట్ట నుంచి సాయంత్రం ఖచ్చితంగా 6 గంటల 55 నిమిషాలకు సమ్మక్క గద్దెలపైకి బయలుదేరారు.

X
దిశ, మేడారం: మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరలో కీలక ఘట్టంగా, చిలకలగుట్ట నుంచి సాయంత్రం ఖచ్చితంగా 6 గంటల 55 నిమిషాలకు సమ్మక్క గద్దెలపైకి బయలుదేరారు. సంప్రదాయ పూజలు, విధివిధానాలు పూర్తి చేసిన అనంతరం అమ్మవారి ఆగమనం ప్రారంభమవ్వడంతో మేడారం అడవులు భక్తి నినాదాలతో మార్మోగాయి. అమ్మవారి ప్రయాణం మొదలైన క్షణం నుంచి భక్తులు “సమ్మక్క తల్లి జై” అంటూ నినాదాలు చేస్తూ పరవశంలో మునిగిపోయారు. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ పవిత్ర సంప్రదాయాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు మార్గమధ్యంలో బారులు తీరారు. ఈ సందర్భంగా పోలీసులు, అధికారులు అప్రమత్తంగా భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ అమ్మవారి ఆగమనాన్ని సజావుగా నిర్వహించారు.
Next Story






