- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రామస్తుల చందాలతో కోతుల పట్టివేత
నిత్యం కోతులతో ఇబ్బంది పడుతున్న మహిళలు ఒక్కటై గ్రామంలో చందాలు వసూలు చేసి వాటిని పట్టి అడవుల్లో వదిలిన ఘటన మండలంలోని రాజుపేటలో శుక్రవారం చోటుచేసుకుంది.

దిశ, మంగపేట : నిత్యం కోతులతో ఇబ్బంది పడుతున్న మహిళలు ఒక్కటై గ్రామంలో చందాలు వసూలు చేసి వాటిని పట్టి అడవుల్లో వదిలిన ఘటన మండలంలోని రాజుపేటలో శుక్రవారం చోటుచేసుకుంది. గత కొద్ది నెలలుగా గ్రామంలో చేరిన వందలాది కోతులు నిత్యం ఇళ్లలోకి చొరబడి నిత్యావసరాలతో పాటు ఇళ్లలో వేసుకున్న పండ్లు, కూరగాయల చెట్లను విరవడంతో పాటు కొట్టడానికి వచ్చే మహిళలపై దాడులు చేస్తూ గాయపర్చిన ఘటనలు ఎన్నో ఈ విషయంలో ప్రజాప్రతినిధులులేని లోటు మండలంలో 15 సంవత్సరాలుగా కనిపిస్తుండగా పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామంలోని మహిళలు ఏకమై ఇంటికి కొంత నగదును చందాల రూపంలో వసూలు చేసి కోతులు పట్టేవారిని పిలిపించి గ్రామంలోని కోతులను పట్టించారు. మహిళలు తీసుకున్న చొరవతో గ్రామంలో ఇకపై కోతుల బెడద ఉండదని ప్రజలు ఊపిరిపీల్పుకుని వారిని అభినందిస్తున్నారు. ప్రతి గ్రామంలో మహిళలు ఇలాగే ముందు పడితే ఆ గ్రామంలో కోతుల బెడద ఉండదంటున్నారు.






