- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆరుబయట ఆడుకుంటుండగా వానర దాడి
by Sridhar Babu |
కోతుల దాడిలో చిన్నారికి గాయాలైన సంఘటన దేవరుప్పుల మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

X
దిశ, దేవరుప్పుల : కోతుల దాడిలో చిన్నారికి గాయాలైన సంఘటన దేవరుప్పుల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం దేవరుప్పుల మెయిన్ రోడ్డులో నివాసం ఉంటున్న మారోజు నరేష్ - రేఖ దంపతుల కుమార్తె సాన్వి అనే చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటుండగా ఒకే సారి కోతులు దాడి చేశాయి. అది గమనించిన స్థానికులు హుటాహుటిన చికిత్స నిమిత్తం వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి వైద్యం అందించారు. మండల వ్యాప్తంగా కోతుల బెడద తీవ్రంగా ఉన్నదని ఆయా గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. అధికారులు స్పందించి కోతుల బెడదను నివారించాలని కోరుతున్నారు.
- Tags
- Monkey attack
Next Story






