Medaram Jatara 2026: అన్నా.. ఫోన్ పే పోతలేదు..మందెట్ల!

by Ajay Maddhiboyina |

మేడారంలో మొబైల్ నెట్వర్క్ సమస్య గతంలో కన్నా ఎక్కువైంది. మిగతా నెట్వర్క్స్ రాకున్నా కాస్తో కూస్తో వస్తుందని ఆశించిన జియో సైతం హ్యాండ్ ఇవ్వడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.

Medaram Jatara 2026: అన్నా.. ఫోన్ పే పోతలేదు..మందెట్ల!
X

దిశ, మేడారం నెట్వర్క్: మేడారంలో మొబైల్ నెట్వర్క్ సమస్య గతంలో కన్నా ఎక్కువైంది. మిగతా నెట్వర్క్స్ రాకున్నా కాస్తో కూస్తో వస్తుందని ఆశించిన జియో సైతం హ్యాండ్ ఇవ్వడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఎయిర్ టెల్ సిగ్నల్స్ ఫోన్లలో కనిపిస్తున్నప్పటికీ, కాల్స్ కనెక్ట్ కాకపోవడంలో సమస్య ఎదురవుతోంది. డయల్ చేసిన వెంటనే డ్రాప్ కావడం, వాయిస్ సరిగా వినపడకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి.

ఫోన్ పే పోతలేదు..!

యూపీఐ అందుబాటులోకి వచ్చినప్పటి నుండి దాదాపుగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పైనే దాదాపుగా అందరూ ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. సెకన్లలో పని జరుగుతుండటంతో ఎక్కువగా ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నారు. మేడారంలో బెల్ట్ షాపుల దగ్గర ఫోన్ పే కొడుతూ.. పేమెంట్ అవక ఇబ్బందులు పడే వాళ్ళు వేలల్లో ఉన్నారు. ప్రతీ బెల్ట్ షాపు దగ్గర ఫోన్ పట్టుకుని అటు ఇటు తిరుగుతున్న యువత కనపడటం సాధారణంగా మారింది. చేతిలో క్యాష్ లేకపోవడం, అమౌంట్ అంత అకౌంట్ లోనే ఉండటంతో సమస్యలు ఎదుర్కొంటున్నారు.

Next Story