- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మానవత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్సీ
by Sridhar Babu |
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మహిళను తన వాహనంలో జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించి తన మానవత్వాన్ని చాటుకున్నారు.

X
దిశ, లింగాలఘణపురం : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మహిళను తన వాహనంలో జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. మండలంలోని పటేల్ గూడెం గ్రామానికి చెందిన పెంతల సోని తన భర్త నాగయ్యతో కలిసి వాహనంపై జనగామకు వెళ్తుండగా కుందారం క్రాస్ రోడ్ వద్ద అకస్మాత్తుగా వ్యక్తి అడ్డం రావడంతో వాహనం అదుపుతప్పి కింద పడిపోయారు. దీంతో సోని తలకు గాయం కావడంతో పాటు ఫిట్స్ వచ్చాయి. ఈ సమయంలో వరద బాధితులను పరామర్శించడం కోసం మహబూబాద్ వెళ్తున్న ఎమ్మెల్సీ ఇది గమనించి బాధితురాలు తల కు గాయం కావడంతో కట్టుకట్టి తన వాహనంలో ఆసుపత్రికి తరలించారు.
Next Story






