మాజీ మంత్రికి నివాళులర్పించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

by velandi.Saikiran |

మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి భౌతిక దేహానికి నివాళులర్పించారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్య

మాజీ మంత్రికి నివాళులర్పించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
X

దిశ, పాలకుర్తి : మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి భౌతిక దేహానికి నివాళులర్పించారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి మృతి చెందడంతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొందని తెలిపారు. ఆయన మరణం పార్టీకి, ప్రజలకు తీరని లోటు అన్నారు. కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో సేవలందించిన మహానేత దామోదర్ రెడ్డి అంటూ కొనియాడారు. ప్రజల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేశారన్నారు. ఎమ్మెల్యే వెంట నియోజకవర్గ నాయకులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు.

Next Story