- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం.. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి..
అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు.

X
దిశ, కొడకండ్ల : అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని బ్లాక్ చౌరస్తాలో రాష్ట్ర ఈజీస్ డైరెక్టర్ అందే యాకయ్య ఆధ్వర్యంలో నిర్మించుకున్న బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలందరూ హక్కులతో, బాధ్యతలతో ఉన్నారంటే అది అంబేద్కర్ ముందస్తు ఆలోచననే అని, ఎన్నో దేశాల నుంచి తిరిగి రాబోయే కాలంలో కావాల్సిన అన్ని కుల, మతాలకు అతీతంగా సమానంగా రాజ్యాంగాన్ని మనకు రాసిచ్చిన గొప్ప నాయకుడని అన్నారు. అంబేద్కర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అని అన్నారు. ఈ సందర్భంగా పాలకుర్తి కాంగ్రెస్ ఇంచార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షులు సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






