- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రమాద ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే పెద్ది..
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని దేశాయిపల్లి గ్రామానికి చెందిన కందికొండ రజనీ కుమార్ తమిళనాడులో ప్రమాదం జరిగిన కథనం ‘దిశ’ లో ప్రచురితం అయిన సంగతి తెలిసిందే.

దిశ, దుగ్గొండి: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని దేశాయిపల్లి గ్రామానికి చెందిన కందికొండ రజనీ కుమార్ తమిళనాడులో ప్రమాదం జరిగిన కథనం ‘దిశ’ లో ప్రచురితం అయిన సంగతి తెలిసిందే. కాగా ప్రమాదంపై నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్పందించారు. తమిళనాడు లోని ట్యూటికొరిన్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులతో పాటు రజనీ కుమార్ కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యే ఫోన్ లో మాట్లాడారు. అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రజనీ కుమార్ కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.
ఇంకా మెరుగైన వైద్యం అందించేందుకు విమానంలో హైదరాబాద్ కు తరలించి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎల్ఒసీ ద్వారా యశోద ఆస్పత్రిలో వైద్యం అందిస్తామని కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు హామీ ఇచ్చారు. రజనీ కుమార్ కు మెరుగైన వైద్యం అందించేందుకు తాను అండగా ఉంటానని అతని కుటుంబ సభ్యులకు పెద్ది భరోసా ఇచ్చారు. దీంతో రజనీ కుమార్ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.






