- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MLA Gandra Satyanarayana Rao రైతులకు రుణమాఫీ మాట ఇచ్చాము.. నిలబెట్టుకుంటున్నాం : ఎమ్మెల్యే గండ్ర
రైతుల రుణమాఫీ పై మాట ఇచ్చాము.. ఇప్పుడు ఆ మాటను

దిశ,శాయంపేట : రైతుల రుణమాఫీ పై మాట ఇచ్చాము.. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకుంటున్నామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయబోతున్న సందర్భంగా శాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీ కి పాలాభిషేకం చేశారు. అనంతరం శాయంపేట బస్టాండ్ సెంటర్ నుండి రైతు వేదిక వరకు నాయకులు, రెైతులు ర్యాలీ తీశారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో రుణమాఫీ చేయబోతున్నామని తెలిపారు.
యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి సాక్షిగా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, ప్రకటించిన తేదీలోపే సంపూర్ణంగా రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. రైతును రాజును చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. గత ప్రభుత్వం రైతులకు మాయమాటలు చెప్పి మోసం చేస్తోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీ మిత్తిలకు కూడా సరిపోలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బుచ్చిరెడ్డి,మాజీ ఎంపీటీసీ కొమ్ముల భాస్కర్,చిందం రవి,దుబాసి కృష్ణమూర్తి,శాయంపేట మండల అధికారులు పాల్గొన్నారు.






