ఓటమి చెందిన నాయకులు నిరాశ చెందవద్దు

by velandi.Saikiran |

సర్పంచ్ లకు, ఉప సర్పంచ్ లకు, వార్డు మెంబర్లకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శుభాకాంక్షలు తెలిపారు.

ఓటమి చెందిన నాయకులు నిరాశ చెందవద్దు
X

దిశ, శాయంపేట: గ్రామాల అభివృద్ధికి సర్పంచ్ లు ఐక్యంగా పని చేసి, ప్రజల సమస్యలను వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల విజయం సాధించిన మండలంలోని గట్లకానిపర్తి, సాధనపల్లి, శాయంపేట గ్రామాల సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు హన్మకొండ లోని ఎమ్మెల్యే స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సర్పంచ్ లకు, ఉప సర్పంచ్ లకు, వార్డు మెంబర్లకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శుభాకాంక్షలు తెలిపారు.

అనంత‌రం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధనకు ప్రజల సమస్యలు సర్పంచ్ లు వేగంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్ల మొదటి దశ విజయవంతంగా పూర్తి అయిందని, రెండో దశ త్వరలో ప్రారంభం కానుందని చెప్పారు. అర్హులందరికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్, నూతన రేషన్ కార్డుల పంపిణీ, సన్నబియ్యం సరఫరా జరుగుతుందని వివరించారు. ఓటమి చెందిన నాయకులు నిరుత్సాహ పడకుండా, రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్నారు.

Next Story