మూడు పంచాయతీల కార్యదర్శుల డిజిటల్ కి దుర్వినియోగం...?

by Nallavelli.Anjaneyulu |

మండలంలో మూడు పంచాయతీ కార్యాలయాల్లో ఈ సేవ నుండి పంచాయతీ కార్యదర్శుల జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ కోసం పంచాయతీ కార్యదర్శులకు డిజిటల్ కి దుర్వినియోగంపై ఆలస్యంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

మూడు పంచాయతీల కార్యదర్శుల డిజిటల్ కి దుర్వినియోగం...?
X

దిశ, బయ్యారం : మండలంలో మూడు పంచాయతీ కార్యాలయాల్లో ఈ సేవ నుండి పంచాయతీ కార్యదర్శుల జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ కోసం పంచాయతీ కార్యదర్శులకు డిజిటల్ కి దుర్వినియోగంపై ఆలస్యంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇరుసులాపురం, నామలపాడు, కొత్తగూడెం పంచాయతీ కార్యదర్శుల డిజిటల్ కీ గత సంవత్సరం (2025) లో నవంబర్, డిసెంబర్ మాసంలో కార్యదర్శులకి జారి కాకపోవడంతో, డిజిటల్ కీ కోసం ముగ్గురు కార్యదర్శులు దరఖాస్తు చేసుకోగా.. కొత్త డిజిటల్ కి వచ్చేలోపే కార్యదర్శులకు సంబంధం లేకుండా, ఆయా పంచాయతీ కార్యాలయాలలో పాత డిజిటల్ కీ తో గుర్తు తెలియని పంచాయతీ ఆపరేటర్లు, డిజిటల్ కీ దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. పాత డిజిటల్ కీ తో మూడు పంచాయతీ లలో జనన, మరణ,ఇతర ధ్రువీకరణ పత్రాలు అనేకం జారీ అయినట్లు మండలంలో గుసగుసలు వినబడుతున్నాయి. డిజిటల్ కీ జాగ్రత్తపరచుకోకపోవడంతోనే పాత డిజిటల్ కీ తో కొంతమంది దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. దీనిపై ఎంపీ ఓ చంద్రమోహన్ వారి సంబంధిత జిల్లా డిఎల్ పిఓ, డిపిఓ సమాచారం ఇచ్చి, జిల్లా అధికారులు ఆదేశానుసారం గా,మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో మండల పంచాయతీ కార్యదర్శుల సిబ్బందితో కి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపై ఎస్సై తిరుపతి నుంచి వివరణ కోరగా మూడు పంచాయతీ కార్యదర్శుల కీ దుర్వినియోగం పై ఎంపీఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయనున్నట్టు తెలిపారు.

Next Story