- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యుద్ధ ప్రాతిపధికన మిషన్ భగీరథ పైపులైన్ మరమ్మతులు పూర్తి చేయాలి
ఏటూరు నాగారం మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో దెబ్బతిన్న మిషన్ భగీరథ ప్రధాన పైపులైన్ మరమ్మతు పనులను సర్పంచ్ కాకులమర్రి శ్రీలత లక్ష్మణ్ బాబు శుక్రవారం పర్యవేక్షించారు.

దిశ, ఏటూరు నాగారం : ఏటూరు నాగారం మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో దెబ్బతిన్న మిషన్ భగీరథ ప్రధాన పైపులైన్ మరమ్మతు పనులను సర్పంచ్ కాకులమర్రి శ్రీలత లక్ష్మణ్ బాబు శుక్రవారం పర్యవేక్షించారు. గ్రామంలో కొత్త విద్యుత్ లైన్లు, స్తంభాల ఏర్పాటు కోసం విద్యుత్ శాఖ వారు గుంతలు తీస్తున్న క్రమంలో, ప్రమాదవశాత్తు మిషన్ భగీరథ ప్రధాన పైపులైన్ ధ్వంసమైంది. దీనివల్ల గత కొంతకాలంగా కొన్ని వార్డుల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రజలకు తాగునీటి ఇబ్బంది కలగకుండా పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మరమ్మతులకు అవసరమైన ప్రత్యేక సామాగ్రిని ఇప్పటికే ఇతర ప్రాంతాల నుంచి తెప్పించామని, పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి శనివారం వరకు అన్ని వార్డులకు యథావిధిగా నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. కొన్ని అనివార్య కారణాల వల్ల జరిగిన ఈ అంతరాయానికి గ్రామ ప్రజలు సహకరించాలని, సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని సర్పంచ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామపంచాయతీ సిబ్బంది సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.






