అదృశ్యమైన వ్యక్తి.. వ్యవసాయ బావి లో శవమై..

by Bhanu |

గత రెండు రోజుల కింద అదృశ్యమైన వ్యక్తి వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఎల్లయ్య గూడెం శివారులోని బోడ మాణిక్యం తండ వ్యవసాయ బావిలో విగతజీవిగా కనిపించాడు.

అదృశ్యమైన వ్యక్తి.. వ్యవసాయ బావి లో శవమై..
X

దిశ, గూడూరు: గత రెండు రోజుల కింద అదృశ్యమైన వ్యక్తి వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఎల్లయ్య గూడెం శివారులోని బోడ మాణిక్యం తండ వ్యవసాయ బావిలో విగతజీవిగా కనిపించాడు. ఈ మృతదేహాన్ని మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగ గ్రామ శివారులోని తేజావత్ తండాకు చెందిన తేజావత్ భద్రు గా గుర్తించారు. గూడూరు సీఐ సూర్యప్రకాష్ తెలిపిన వివరాల ప్రకారం గూడూరు మండలం గుండెంగ గ్రామానికి చెందిన తేజవత్ భద్రు వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉంటాడు. గత రెండు రోజుల కిందట సాయంత్రం ఇంట్లో నుండి బయటకు వెళ్లి వస్తానని చెప్పిన భద్రు ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో చుట్టుపక్కల మరియు బంధువుల ఇళ్లలో వెతికిన ఆచూకీ లభించలేదు.


దీంతో గూడూరు పోలీస్ స్టేషన్ లో తన భర్త అదృశ్యమైనట్టు భార్య నీల ఫిర్యాదు చేయడంతో పోలీసులు ముమ్మరంగా వెతుకుతున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం చెన్నారావుపేట మండలం ఎల్లయ్యగూడెం పరిధిలోని వ్యవసాయ బావిలో మృతదేహం కనిపించింది. సమీప బంధువులే తన భర్తను హత్య చేశారని భార్య నీల ఆరోపిస్తుంది. వారి కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు మరియు గ్రామస్తులు గూడూరు నెక్కొండ ప్రధాన రహదారిపై ఆందోళన నిర్వహించారు. మృతుని భార్య నీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని త్వరలో పూర్తి వివరాలను వెల్లడిస్తామని గూడూరు సిఐ సూర్యప్రకాష్ తెలిపారు.

Next Story