- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దారి తప్పిన ఇసుక రవాణా
- అనుమతి తీసుకున్నది ఒక మండలం.. తరలిస్తున్నది వేరొక మండలం
- పొరపాటుగా పడింది: టేకుమట్ల తహసీల్దార్ వివరణ
దిశ,శాయంపేట: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి ఇసుక రవాణా లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. వివరాల్లోకి వెళితే శాయంపేట మండలంలోని పలు గ్రామాల్లో అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం. ఇసుక తరలించడానికి అనుమతి పత్రానికి సంబంధించి అనుమతి పొందింది ఒక మండలానికి అయితే ఇసుక తరలిస్తున్నది మాత్రం శాయంపేట మండలంలోని పలు గ్రామాల్లో ఇసుక తరలిస్తున్నారు. ఇసుక అనుమతి సంబంధించి లబ్ధిదారుడు సదరు గ్రామపంచాయతీ కార్యదర్శి కి అర్జీ పెట్టుకుంటే కార్యదర్శి మండల ఎంపీడీవో ఇసుక నిమిత్తం దరఖాస్తు ని ఫార్వర్డ్ చేస్తారు. దానిని పరిశీలించిన తర్వాత ఇసుక క్వారి పరిధికి సంబంధించిన తహసీల్దార్ ఇసుక అనుమతి పత్రాన్ని మంజూరు చేస్తారు. అయితే టేకుమట్ల మండల తాసిల్దార్ జారీచేసిన ఇసుక అనుమతి పత్రంలో గోరి కొత్తపల్లి మండలం సాధన పల్లి గ్రామం అని ఉంది కానీ సాధన పల్లి గ్రామం హనుమకొండ జిల్లా శాయంపేట మండలం లో కలదు.
పొరపాటుగా పడింది: టేకుమట్ల తహసీల్దార్
ఈ విషయమై దిశ విలేఖరి భూపాలపల్లి జిల్లా టేకుమట్ల తహసీల్దార్ ని సంప్రదించగా ఇసుక అనుమతికి సంబంధించి గోరికొత్తపల్లి మండల ఎంపీడీవో పంపిన ఆర్జీకి మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగిందని చెప్పారు. మరోసారి తహసీల్దార్ ను ఫోన్ ద్వారా సంప్రదించగా ఇసుక అనుమతి పత్రానికి సంబంధించి పొరపాటుగా పడింది అని చెప్పారు.
అనుమతి కోరింది విజ్జయ్య పల్లి గ్రామ లబ్ధిదారుడికి
ఈ విషయమై గోరి కొత్తపల్లి మండల ఎంపీడీవో ని సంప్రదించగా తాము ఇసుక అనుమతి గూర్చి టేకుమట్ల తహసిల్దార్ కి మండలంలోని ఇజ్జయ పల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారునికి మాత్రమే ఇవ్వడం జరిగింది. సాధన పల్లి అనే గ్రామం కొరకు మేము అర్జీ పెట్టలేదు. సాధనపల్లి గ్రామం మా పరిధిలోకి రాదని వివరించారు.






