ఎనుమాముల ఎర్ర బంగారం..ఒకే రోజు 45వేల బస్తాలు

by velandi.Saikiran |   (  Updated:2026-03-23 22:31:24  IST  )

వరంగల్ ఏనుమాముల మార్కెట్ కు మిర్చి పోటెత్తింది. వరస సెలవుల తర్వాత మార్కెట్ తెరవడంతో భారీగా రైతులు మిర్చిని మార్కెట్ కు తెచ్చారు

ఎనుమాముల ఎర్ర బంగారం..ఒకే రోజు 45వేల బస్తాలు
X

ఏనుమాముల ఎర్రబంగారం

=ఒకే రోజు 45వేల బస్తాలు

దిశ, వరంగల్ బ్యూరో : వరంగల్ ఏనుమాముల మార్కెట్ కు మిర్చి పోటెత్తింది. వరస సెలవుల తర్వాత మార్కెట్ తెరవడంతో భారీగా రైతులు మిర్చిని మార్కెట్ కు తెచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులే కాకుండా కరీంనగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల నుంచి రైతులు మార్కెట్ కు తరలివచ్చారు. సోమవారం 45వేల బస్తాలకు పైగా మిర్చి రావడంతో కొనుగోలుకు అధికారులు ఏర్పాటు చేశారు. తేజా, యూఎస్341 రకానికి చెందిన మిర్చిని రైతులు ఎక్కువగా తీసుకువచ్చారు. గడిచిన 15 రోజుల్లో మార్కెట్ కు మిర్చి ఎక్కువగా వస్తుంది. ప్రతీరోజు 25వేల నుంచి 35వేల బస్తాల వరకు వస్తుంది. దేశవ్యాప్తంగా ఈయేడు మిర్చికి డిమాండ్ ఉన్నా అందుకనుగుణంగా ధరలు మాత్రం రావడం లేదు. మార్కెట్ లో మిర్చీ కొనుగోలు చేసే వ్యాపారులు కొంతమందే ఉన్నారు. ఉమ్మడి జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి వచ్చే మిర్చిని ఈ వ్యాపారులే కొనుగోలు చేస్తారు. మార్కెట్ ఆరంభంలోనే సిండికేట్ గా మారి ధరల నిర్ణయం చేస్తారు. మార్కెట్ అన్ని రకాల ఏర్పాట్లు చేశామని కార్యదర్శి మల్లేశం తెలిపారు.

Next Story