దమ్ముంటే మంత్రులు మార్కెట్ యార్డును సందర్శించాలి : మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకరరావు

by Ratna Kumari |

రాష్ట్ర మంత్రులకు దమ్ముంటే మార్కెట్ యార్డును సందర్శించాలని, రైతులకు న్యాయం చేయాలని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు.

దమ్ముంటే మంత్రులు మార్కెట్ యార్డును సందర్శించాలి : మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకరరావు
X

దిశ వరంగల్ బ్యూరో / పాలకుర్తి : రాష్ట్ర మంత్రులకు దమ్ముంటే మార్కెట్ యార్డును సందర్శించాలని, రైతులకు న్యాయం చేయాలని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. పాలకుర్తి మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ మార్కెట్ యార్డ్లో బుధవారం ధాన్యం కొనుగోళ్ళ ను పరిశీలించారు. పాలకుర్తి నియోజకవర్గ పరిసర గ్రామాల రైతులు అకాల వర్షంతో పండించిన ధాన్యం నేల పాలై ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం రైతులకు విత్తనాలు, ఎరువులు ఇవ్వలేకపోతోందన్నారు. సకాలంలో రైతుబంధు ఇవ్వకపోగా.. కనీసం పండిన పంటను మద్దతు ధరకు కొనే పరిస్థితిలో కూడా లేదన్నారు. ఇది ముమ్మాటికీ రైతు వ్యతిరేక ప్రభుత్వమన్నారు.

వారం రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నామని రైతులు కన్నీరు పెట్టుకుంటున్నా పట్టించుకోవడం లేదన్నారు.ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలన్నారు. సంచులు లేవని, లారీలు సరిగా రావటం లేదని రైతులు తమ బాధ తెలపగా జనగామ జిల్లా కలెక్టర్ గారికి ఫోన్ చేయటం జరిగిందన్నారు. ఆరుగాలం కష్టపడ్డ రైతుల వడ్లు కూడా రోడ్ల మీదనే ఉన్నాయన్నారు. ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్ లో ప్రతి పంటకు బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ ఇప్పుడు బోనస్ ఎగ్గొట్టి ఆ మాటను బోగస్ చేసిందన్నారు. గత యాసంగి బోనస్ వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ ప్రభుత్వం కరెంటు ఇవ్వరు, రైతుబంధు వేయరని విమర్శించారు. బోనస్ ఇవ్వరు, పండిన పంటను మద్దతు ధరకు కొనరు. ఇప్పటికైనా ప్రభుత్వం కొనుగోలు వేగవంతం చేసి రైతులని ఆదుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు.

Next Story