- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులకు గుడ్ న్యూస్..ధాన్యం కొనుగోళ్లపై కీలక ప్రకటన !
రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రైతుల కోసం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నామని మంత్రి తుమ్మల అన్నారు.

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
దిశ భూపాలపల్లి ప్రతినిధి: రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రైతుల కోసం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం రోజు భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని నస్తూరుపల్లి గ్రామంలో జరిగిన రైతు ఉత్సవాల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రితో కలిసి ఆయన రైతు భరోసనిధులు విడుదల చేశారు. గత ప్రభుత్వం రైతులను పీడించిపిప్పి చేసిందని సీరియస్ అయ్యారు. గిట్టుబాటు ధర ఇవ్వకపోవడంతో పాటు రైతులు అమ్మిన పంటలో కోత విధించి తీరని అన్యాయనికి గురి చేసిందని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధరతో పాటు ధాన్యం కొనుగోలులో ఎలాంటి కోత విధించడం లేదని తెలిపారు. అదే విధంగా రైతులకు సన్న వడ్లకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని అన్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసినట్లు గుర్తు చేశారు.






