- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెద్దపల్లి-భూపాలపల్లి ప్రజలకు మంత్రి శ్రీధర్ బాబు కృతజ్ఞతలు
భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తురుపల్లి గ్రామంలో నిర్వహించిన రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమానికి భారీగా హాజరై విజయవంతం చేశారు.

దిశ, భూపాలపల్లి ప్రతినిధి : భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తురుపల్లి గ్రామంలో నిర్వహించిన రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమానికి భారీగా హాజరై విజయవంతం చేశారు. పెద్దపల్లి-భూపాలపల్లి జిల్లాల ప్రజలకు రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంగళవారం ఓ ప్రకటనలో ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పై ప్రజలు చూపిస్తున్న విశ్వాసం తమకు మరింత బాధ్యతను పెంచిందని పేర్కొన్నారు. అలాగే మంథని నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, మహిళా సోదరిమణులు, యూత్ కాంగ్రెస్ సోదరులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన జిల్లా అధికారులకు, సిబ్బందికి పోలీస్ శాఖ సిబ్బందికి వాలంటీర్స్ కు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు మంత్రి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. వారి సమన్వయం, క్రమశిక్షణ వల్ల కార్యక్రమం విజయవంతంగా పూర్తయిందని అభినందించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరి పాత్ర అభినందనీయమని .. ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.






