మహా మేడారం జాతర..మంత్రి సీత‌క్క కీల‌క ప్ర‌క‌ట‌న‌

by velandi.Saikiran |

మహా మేడారం జాతర పోస్టర్ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి,

మహా మేడారం జాతర..మంత్రి సీత‌క్క కీల‌క ప్ర‌క‌ట‌న‌
X

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి: వచ్చే సంవత్సరం జనవరి 28 నుంచి 30వ తేదీ వరకు జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి హాజరు కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క కోరారు. ఆదివారం హైదరాబాదులో ముఖ్యమంత్రి నివాసంలో మహా మేడారం జాతర పోస్టర్ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ తో కలిసి ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగ‌కుండా, అభివృద్ధి పనులు చురుకుగా కొనసాగుతున్నాయని వెల్ల‌డించారు. గద్దెల ప్రాంతంలో చేపట్టిన పునరుద్ధరణ పనులు వేగవంతమయ్యాయని సీఎంకు వివరించారు. మహా జాతర సందర్భంగా అమ్మవార్లను దర్శించుకోవడానికి మేడారం రావాలని ఆమె రేవంత్ రెడ్డిని కోరారు.

Next Story