- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి: మంత్రి సీతక్క
త్వరలోనే ముఖ్యమంత్రి జిల్లాకు రానున్నారని మంత్రి సీతక్క తెలిపారు.

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి: జిల్లాలో పూర్తయిన అభివృద్ధి పనులకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు ఉంటాయని, త్వరలోనే ముఖ్యమంత్రి జిల్లాకు రానున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. ప్రస్తుత వర్షాకాలంలో మొక్కలు నాటే విషయంలో అనుకున్న లక్ష్యాలను మించి మొక్కలు నాటాలని, అటవీ శాఖ అధికారులు విరిగా ప్రజలకు మొక్కలను పంపిణీ చేయాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ బోర్కేడ్ హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, డిఎఫ్ఓ వికాస్ మీనా, ఐటీడీఏ పీవో నవీన్ వత్సల్ టొప్పో లతో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, జిల్లాలో చేపట్టిన పల అభివృద్ధి కార్యక్రమాలపై ఆయా శాఖ అధికారులు దృష్టి సారించాలని, అన్ని పనులు అనుకున్న సమయంలోనే పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుత వర్షాకాలంలో జిల్లాలోని అన్ని గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసి గతంలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా జిల్లా యంత్రాంగం ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అన్నారు.
రాష్ట్రంలోనే జిల్లా ముందంజలో ఉండే విధంగా...
జిల్లాలోని పలు చెరువులకు గోదావరి జలాలను తరలించడానికి ఏర్పాటు చేయనున్న పైప్ లైన్ల ఏర్పాటు పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అన్న నమస్తే ప్రస్తుత వ్యవసాయ సాగు సందర్భంగా రైతులకు యూరియా కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. భూముల సర్వేలను పూర్తి చేయడానికి అదనంగా సిబ్బందిని నియమించుకోవాలని తెలిపారు. అభివృద్ధి విషయంలో రాష్ట్రంలోనే జిల్లా ముందంజలో ఉండే విధంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని ఆదేశించారు. మేడారం అభివృద్ధి పనులు, పెండింగ్ పనులను 10 రోజుల్లో పూర్తి చేయాలని, త్వరలో సీఎం అనుముల రేవంత్ రెడ్డి మేడారం, ములుగు జిల్లాల్లో పర్యటించనున్నారని అన్నారు. జిల్లాలో 6 వేల కోట్ల రూపాయలతో పంచాయతీ రాజ్ శాఖ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని, సీఎం పర్యటన తేదీని త్వరలో ఖరారు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మహేందర్ జి, సంపత్ రావు, ఆర్డిఓ కృష్ణవేణి, డిఆర్ఓ రవికుమార్, పంచాయతీరాజ్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ భానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, మున్సిపల్ చైర్మన్ చింతనిప్పుల చంద్రకళ బిక్షపతి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.






