- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇచ్చిన హామీలన్నిటిని నిలబెట్టుకుంటాం: మంత్రి సీతక్క
ఇచ్చిన హామీలన్నిటిని నిలబెట్టుకుంటామని మంత్రి సీతక్క తెలిపారు.

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి: జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన కలెక్టర్ కార్యాలయ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించబోతున్నామని, చిన్న పట్టణంగా ఉన్న ములుగు నేడు పెద్ద పట్టణంగా ఎదుగుతున్న తరుణంలో ప్రజలకు వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా త్వరలోనే ములుగులో రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. శనివారం ములుగు కేంద్రంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో 17 కోట్ల రూపాయల సిఆర్ఆర్ 2025-26 నిధులతో చేపట్టిన పలు రోడ్డు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీతక్క మాట్లాడుతూ.. ఎన్నికల ముందు తాము ఇచ్చిన హామీలన్నిటిని నెరవేరుస్తున్నామని, ములుగు మున్సిపాలిటీ పరిధిలో 50 కోట్ల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని వివరించారు.
పేదలను గుర్తించి మరో 100 ఇండ్లను కేటాయిస్తాం..
మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల నూతన భవనాలకు శంకుస్థాపన చేయడం జరిగిందని, రానున్న రోజులలో పీజీ కళాశాల సైతం ప్రారంభం కాబోతున్నదని తెలిపారు. పది తరాలకు నిలిచిపోయే విధంగా నాణ్యతతో కూడిన అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని, ములుగు మున్సిపాలిటీలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం జరుగుతున్నదని తెలిపారు. గతంలో ములుగు కేంద్రానికి 100 ఇందిరమ్మ ఇండ్లను కేటాయించగా పేదలను గుర్తించి మరో 100 ఇండ్లను కేటాయిస్తామని, ఇందిరమ్మ పేరుతో నిర్మిస్తూ నిలిచిపోయిన భవనాలకు సైతం నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ ఫలాలను అర్హులందరికీ అందే విధంగా ప్రజా ప్రతినిధులు చొరువ చూపాలని సూచించారు. కార్యక్రమాలలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కళ్యాణి, మున్సిపల్ చైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, వైస్ చైర్‌పర్సన్ ఆసియా షాహిన్, మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి, కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, కో-ఆప్షన్ సభ్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.






