ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి.. Minister Sabitha Indra Reddy

by Dishafeatures2 |
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి.. Minister Sabitha Indra Reddy
X

దిశ, నర్సంపేట టౌన్: ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని, ఉన్నత చదువులు అందించిన గురువులకు, గురుకులానికి వన్నె తేవాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్థులకు సూచించారు. నర్సంపేటలోని శ్రీ గురుకుల విద్యాలయంలో జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పూర్తిస్థాయి ప్రైవేట్ ప్రోగ్రాం అయినప్పటికీ విద్యాశాఖ మంత్రి రాకతో వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణతో పాటు వరంగల్, హన్మకొండ జిల్లా విద్యా శాఖాధికారులు వాసంతి, అబ్దుల్ హై, అలాగే మండల విద్యాధికారి రత్నమాల హాజరై విద్యాశాఖ మంత్రికి పూల బొకే తో స్వాగతం తెలిపారు. అనంతరం పూర్వ విద్యార్థులనుద్దేశించి మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడారు. గురుకులాలు ఉత్తమ విద్యార్థులను తీర్చి దిద్దుతాయనడానికి శ్రీ గురుకులం తార్కాణం గా నిల్చిందన్నారు. దేశ, విదేశాల్లో స్థిరపడిన విద్యార్థులు ఇక్కడ చేరుకొని 50 ఏళ్ల స్మృతులను పెంచుకోవడం గొప్ప అనుభూతిగా ఉందన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండేలా విలువలు నేర్పేది గురుకుల పాఠశాలలు అని అదే స్ఫూర్తి తో ముఖ్యమంత్రి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అత్యుత్తమ విద్యని అందించే ప్రయత్నం చేస్తోందని అన్నారు. అందులో భాగంగా గురుకుల పాఠశాలల ను నెలకొల్పి గ్రామీణ విద్యార్థులకు సేవలు అందిస్తుందని అన్నారు.


ప్రభుత్వ విద్యా సంస్థల అభివృద్ధిని చేపడుతూనే మరోవైపు ప్రైవేట్ లో ఉత్తమ విలువలు పాటిస్తున్న సంస్థలకి తోడ్పాటును తమ ప్రభుత్వం అందిస్తుందని ఆమె అన్నారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఒక పక్క మన ఊరు మన బడి లాంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ బడులని బలోపేతం చేస్తూనే ప్రవేట్ విద్యా సంస్థల అభివృద్ధిని కోరుకుంటుందని అన్నారు. నిత్య విద్యార్థుల క్రమ శిక్షణ ఈ రోజు చూస్తున్నామని, 50 ఏళ్ల పూర్వ విద్యార్థి సమ్మేళనానికి హాజరైన శ్రీ గురుకుల పాఠశాల విద్యార్థులను పొగిడారు. ప్రభుత్వం విద్యాభివృద్ధికి కట్టుబడి ఉందని, నర్సంపేట నియోజక వర్గాన్ని విద్యా హబ్ గా మార్చడంతో పాటు వ్యవసాయ రంగంలో కూడా అగ్రగామిగా చేసే సదుద్దేశంతో శ్రమిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ గురుకుల యజమాని మోతే సమ్మి రెడ్డి ముఖ్య అతిథిలను సన్మానించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ, ఎంపీటీసీ లతో పాటు పలువురు విద్యావేత్తలు పాల్గొన్నారు.


Next Story

Most Viewed