రేపు ఏజెన్సీ మండలాల్లో పర్యటించనున్న మంత్రి పొంగులేటి.

by Bhanu |

రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపూరం మండలాల్లో బుధవారం పర్యటించి పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కార్యక్రమాలలో పాల్గొనరున్నారు.

రేపు ఏజెన్సీ మండలాల్లో పర్యటించనున్న మంత్రి పొంగులేటి.
X

దిశ, ములుగు ప్రతినిధి: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపూరం మండలాల్లో బుధవారం పర్యటించి పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కార్యక్రమాలలో పాల్గొనరున్నారు. వాజేడు, వెంకటాపురం మండలాల్లో మంత్రి పర్యటన ప్రదేశాలను జిల్లా కలెక్టర్ దివాకర మంగళవారం పరిశీలించారు. బుధవారం ఉదయం వాజేడు మండలం టేకులగూడెం, నాగారం, ఎజ్జర్లపల్లి, వెంకటాపురం మండలం వెంకటాపురం, పాత్రపురం గ్రామాలలో మంత్రి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న నేపథ్యంలో జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Next Story