- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మేడారంలో బైక్ పై మంత్రి పొంగులేటి పరిశీలన
గురువారం ఉదయం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్ దివాకర ఇతర అధికారులతో కలిసి బైక్‌లపై మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించారు.

X
దిశ, మేడారం న్యూస్ నెట్‌వర్క్: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. జాతరలో భాగంగా తొలిరోజు కన్నెపల్లి నుంచి సారలమ్మ దేవత గద్దెపైకి కొలువుదీరడంతో ఉత్సవాలు ఊపందుకున్నాయి. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో ములుగు జిల్లాలోని మేడారం పరిసర ప్రాంతాలన్నీ జనసంద్రంగా మారాయి. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్ దివాకర ఇతర అధికారులతో కలిసి బైక్‌లపై మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మేడారం జంపన్న వాగు వద్ద భక్తుల స్నానాలకు గల ఏర్పాట్లను, పరిసర ప్రాంతాల పారిశుద్ధ్య వ్యవస్థను మంత్రి స్వయంగా చెక్ చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు తగు ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
Next Story






