- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘బలగం’ నటులను సన్మానించిన మంత్రి ఎర్రబెల్లి..
ఇటీవల రిలీజ్ అయి అతితొందరలోనే ప్రజల మన్ననలు పొందిన బలగం సినిమా యూనిట్ సభ్యులను మండల కేంద్రంలో సోమవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సన్మానించారు.

దిశ, రాయపర్తి: ఇటీవల రిలీజ్ అయి అతితొందరలోనే ప్రజల మన్ననలు పొందిన బలగం సినిమా యూనిట్ సభ్యులను మండల కేంద్రంలో సోమవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సన్మానించారు. బలగం సినిమా నటులలో ఒకరైన పెరికబోయిన బాబు మండల కేంద్రానికి చెందినవాడు. అతను బలగం సినిమాలోని కొమురయ్య అనే పాత్రలో అద్భతంగా నటించడంతో మంచి గుర్తింపు లభించింది.
కాగా బాబు సోమవారం మండల కేంద్రంలోని తన ఇంటికి రాగా మంత్రి దయాకర్ రావు మండల పర్యటనలో ఉన్నట్లు తెలుసుకొని మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి బాబుతోపాటు తనతో వచ్చిన చిత్ర యూనిట్ సభ్యులను సన్మానించారు. మీరు మరిన్ని సినిమాలలో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని మంత్రి ఎర్రబెల్లి ఆకాంక్షించారు. ఆయన వెంట మండల నాయకులు బిల్లా సుధీర్ రెడ్డి, మూనావత్ నరసింహ నాయక్, సర్పంచ్ నర్సయ్య, ఎంపీటీసీ అయిత రామచంద్ర, పూస మధు తదితరులు పాల్గొన్నారు.






