తాటికల్లు సేవించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (వీడియో)

by Dishafeatures2 |
తాటికల్లు సేవించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన రూటే సెపరేట్ అన్నట్లు మెలుగుతుంటారు. ముఖ్యంగా కార్యకర్తలను సంతృప్తి పరచడానికి ఏది చేయడానికైనా సిద్ధంగా ఉంటారని అంతా అంటుంటారు. కూలీలతో కలిసి పొలాల్లోకి వెళ్లి నాటు వేయడం, హమాలీల వద్దకు వెళ్లి బస్తాలు మోయడం, కార్యకర్తలు చనిపోతే పాడె మోయడం లాంటివి ఎన్నో ఎర్రబెల్లి దయాకర్ రావు చేస్తుంటారు. తాజాగా అలాంటి ఓ ఘటనే జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆదివారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆవిష్కరించారు. ఈ క్రమంలోనే గౌడ సోదరులు తాటి కల్లు తాగాలని మంత్రిని కోరారు. గౌడన్నల కోరిక మేరకు మంత్రి తాటికల్లు తాగారు. ప్రస్తుతం మంత్రి కల్లు తాగిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story

Most Viewed