- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అత్యున్నత ప్రమాణాలతో కంటి పరీక్షలు.. మంత్రి ఎర్రబెల్లి
రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత ప్రమాణాలతో కంటి పరీక్షలు నిర్వహిస్తోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

X
దిశ, రాయపర్తి: రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత ప్రమాణాలతో కంటి పరీక్షలు నిర్వహిస్తోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గురువారం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామంలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని కలెక్టర్ గోపితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంధత్వంతో ఏ ఒక్కరూ బాధపడొద్దనే ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. 100 రోజుల పాటు కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఇక్కరూ కంటి వెలుగు పరీక్షలు చేయించుకోవాలని కోరారు. పరీక్షల అనంతరం అవసరమైన వాళ్లకు ప్రభుత్వమే ఉచితంగా కళ్లద్దాలు ఇస్తుందని అన్నారు.
Next Story






