ఏనుగల్‌కు రానున్న కేటీఆర్.. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

by Disha Web Desk 6 |
ఏనుగల్‌కు రానున్న కేటీఆర్.. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
X

దిశ పర్వతగిరి: వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరి మండలం ఏనుగల్‌కు మంత్రి కేటీఆర్ రానున్న సందర్భంగా ఏనుగల్ గ్రామంలో స్థలం పరిశీలన హెలిప్యాడ్, సభా స్థలం, పార్కింగ్ ప్లేస్‌లను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, వర్ధన్నపేట ఎమ్మెల్యే రమేష్ పర్వతగిరి జడ్పిటిసి బానోత్ సింగ్‌లాల్ తక్కళ్లపెల్లి నారాయణ రావు, తక్కళ్లపెల్లి భాస్కర్ రావు బోయినపల్లి యుగేందర్ అక్కడ చేయాల్సిన ఏర్పాట్లను అధికారులతో చర్చించారు.

మంత్రి ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో అక్కడ మహిళలకు ఏర్పాటు చేయనున్న క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని కేటీఆర్ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ రోజు ప్రారంభిస్తారు. ఈ స్క్రీనింగ్‌ని మహిళలు ఉపయోగించుకోవాలని మంత్రి, ఎర్రబెల్లి, బోయిన పల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే రమేష్, తక్కళ్లపెల్లి నారాయణ రావు, తక్కళ్లపెల్లి భాస్కర్ రావు , బోయినపల్లి యుగేందర్ రావు మరియు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు కోరారు.

Next Story

Most Viewed