మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

by Disha Web Desk 20 |
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
X

దిశ, రాయపర్తి : మహిళలు తమకు ఉన్నటువంటి నైపుణ్యంతో అన్నిరంగాల్లో రానించి ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వం ఉచితంగా మహిళలకు కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటుచేసి మహిళలకు మూడో విడత శిక్షణ పూర్తిచేసుకున్న సందర్భంగా కుట్టుమిషన్ కేంద్రాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో రాణించి ఆర్థికంగా తమకుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని ఉద్దేశంతో రాష్ట్రప్రభుత్వం మహిళలకు ఉచిత కుట్టుమిషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇప్పటికి మూడో విడతలుగా మహిళలకు ఉచిత కుట్టుమిషన్ శిక్షణ అందించిందన్నారు.

ఈ కుట్టు మిషన్ కేంద్రం ద్వారా మహిళలు శిక్షణను పొంది తమ కాళ్లపై తాము నిలబడి కుటుంబానికి అండగా ఉంటూ డబ్బులు సంపాదించుకోవచ్చు అన్నారు. వరంగల్లో త్వరలో టెక్స్ టైల్స్ పార్క్ లో శిక్షణ పొందిన మహిళలందరికీ నైపుణ్యం ద్వారా ఉద్యోగాలు పొందవచ్చు అన్నారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఒకప్పుడు మహిళలు బయటకు రావాలంటేనే భయపడే వారిని కానీ ఇప్పుడు ఆ భయం అవసరం లేదని మహిళలు ధైర్యంగా తమ కుటుంబ అవసరాల నిమిత్తం ఉద్యోగాలు చేస్తున్నారని అభినందించారు. అనంతరం మండల కేంద్రంలోని ఐకేపీ ఆధ్వర్యంలో ఇల్లంద వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన మొక్కల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు తాము పండించిన పంటలను దళారులకు అమ్మి మోసపోకుండా ఉండేందుకు ప్రభుత్వం మద్దతు ధర అందించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులు అధైర్య పడద్దని వర్షం కారణంగా దెబ్బతిన్న పంటలకు పరిశీలించి ఆదుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ కలెక్టర్ ప్రావిణ్య, పీడీ సంపత్ రావు, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగుకుమార్, తహసిల్దార్ కుసుమ సత్యనారాయణ మండల రైతుబంధుకు సమన్వయ సమితి అధ్యక్షుడు ఆకుల సురేందర్రావు, పీఎసీఎస్ చైర్మన్ రామచంద్రారెడ్డి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు నరసింహ నాయక్, స్థానిక సర్పంచ్ గారే నరసయ్య, బీఆర్ఎస్ జిల్లా నాయకులు బిల్లా సుధీర్ రెడ్డి, కార్యదర్శి పూసమధు, మండల కో ఆప్షన్ ఎండి అశరఫ్, వనజారని ఎండీ నయం, ఎండీ అన్వర్ పాషా తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed