‘ఐఐహెచ్‌టీ’లో ప్రవేశాలకు సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదం

by Shiva Kumar |
‘ఐఐహెచ్‌టీ’లో ప్రవేశాలకు సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదం
X

దిశ, తెలంగాణ బ్యూరో: కనుముక్కు గ్రామంలోని పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్‌లో గల 23 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ)లో డిప్లొమా, డిగ్రీ ప్రోగ్రాంలలో విద్యార్థుల ప్రవేశాలకు సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదం తెలిపారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర‌రావు మంగళవారం తెలిపారు. మర మగ్గాలు, చేనేత మగ్గాల ఆధునీకరణ కొరకు బీసీ వెల్ఫేర్ శాఖ నుంచి నేతన్నలకు సహాయం అందించబోతున్నట్లు ఆయన తెలిపారు. 2024 -25 ఏడాదికి గాను బీసీ వెల్ఫేర్ శాఖ ద్వారా కేటాయించిన రూ.400 కోట్ల బడ్జెట్ వినియోగించుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి అంగీకరించినట్లు మంత్రి తమ్మల వెల్లడించారు. టీఎస్‌సీవో ద్వారా సానిటరీ నాప్కిన్లు ఉత్పతి పరిశ్రమను పోచంపల్లి‌లో స్థాపించేందుకు ఆమోదం లభించిందని అన్నారు. పాఠశాలలకు వెళ్లే బాలికలకు ఋతుక్రమ సమయంలో పరిశుభ్రత పాటించడానికి, బడికి గైర్హాజరును నిరోధించేందుకు గాను సానిటరీ నాప్కిన్లను స్వయం సహాయక సంఘాల ద్వారా సరఫరా చేయాలని నిర్ణయించిమని తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల నుంచి టీఎస్‌సీవోకి రావాలసిన అన్ని పెండింగ్ బాకాయిలను విడుదల చేసేందుకు సీఎం అంగీకరించారని మంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత కార్మికుల అభివృద్ధికి కట్టుబడి ఉందని, అదేవిధంగా వారి సంక్షేమం కోసం పాటుపడుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.



Next Story

Most Viewed