పదేళ్లు @ రూ.615.54 కోట్లు.. ఫ్యాన్సీ నెంబర్లతో ఆర్టీఏకు కాసుల పంట

by Shiva |
పదేళ్లు @ రూ.615.54 కోట్లు.. ఫ్యాన్సీ నెంబర్లతో ఆర్టీఏకు కాసుల పంట
X

దిశ, తెలంగాణ బ్యూరో: వాహనాల ఫ్యాన్సీ నెంబర్లు ఆర్టీఏకు కాసుల పంట కురిపిస్తున్నాయి. వాహనాల కొనుగోళ్లలోనే కాదు.. వాటి నెంబర్ల కోసం వాహనదారులు పోటీ పడుతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఈ పదేళ్లలో కేవలం ఫ్యాన్సీ నెంబర్లకే రూ.615.54 కోట్ల ఆదాయం సమకూరింది. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయ పరిధిలో టీజీ 09, 9999 ఫ్యాన్సీ నెంబర్ కోసం అత్యధికంగా ఓ కంపెనీ రూ.25.50 లక్షలు వెచ్చించడం ఫ్యాన్సీ నెంబర్లకు క్రేజీ ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు. 2014-15లో రూ.23.24 కోట్లు, 2015-16 లో రూ.26.38 కోట్లు, 2016-17లో రూ.35.45 కోట్లు, 2017-18లో రూ.47.91 కోట్లు, 2018-19లో రూ.55.41 కోట్లు, 2019-20లో రూ.60.56 కోట్లు, 202-21లో రూ.44.45 కోట్లు, 2021-22లో రూ.79.13 కోట్లు, 2022-23లో రూ.110.43 కోట్లు, 2023-24లో రూ.119.73 కోట్లు, 2024-25(మే20వరకు)రూ.రూ.12.85 కోట్లు ఆదాయం సమకూరినట్లు ఆర్టీవో అధికారులు తెలిపారు.

Next Story

Most Viewed