క్రీడలతో మానసికోల్లాసం: ఎస్పీ శరత్ చంద్ర పవార్

by Disha web |
క్రీడలతో మానసికోల్లాసం: ఎస్పీ శరత్ చంద్ర పవార్
X

దిశ, మహబూబాబాద్ టౌన్: క్రీడలు మానసికోల్లాసాన్ని పెంపొందించడమే కాకుండా పోలీసుల శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడానికి దోహదపడతాయని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. జిల్లాలోని స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం మహబూబాబాద్, తొర్రూరు సబ్ డివిజన్ మహిళా సిబ్బందికి ఖోఖో, కబడ్డీ పోటీలను నిర్వహించారు. ఈ ఆటల పోటీలకు ముఖ్యఅతిథిగా హాజరై ఎస్పీ మాట్లాడారు. క్రీడలు వ్యక్తిలోని నాయకత్వ లక్షణాలను, ఐకమత్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ఆటల పోటీల్లో గెలుపోటములు సహజమని, టీం స్పిరిట్ గొప్పదని అన్నారు.

క్రీడలు మనలో దాగి ఉన్న శక్తి సామర్థ్యాలను, పోరాట పటిమను వెలికితీస్తాయన్నారు. అనంతరం పోటీలలో గెలుపొందిన జట్లకు బహుమతులు ప్రదానం చేశారు. కబడ్డీ పోటీలో తొర్రూరు జట్టు విజయం సాధించగా, ఖోఖో పోటీలో మహబూబాబాద్ జట్టు విజయం సాధించింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య, మహబూబాబాద్ ఇంచార్జి డీఎస్పీ రమణబాబు, గేమ్ ఆర్గనైజర్ ఆర్ఐ సురేష్, టౌన్ సీఐ సతీష్, రూరల్ సీఐ రమేష్, ఆర్ఐ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.



Next Story