- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ పర్యటనను విజయవంతం చేయాలి
మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని.

దిశ, హనుమకొండ కలెక్టరేట్ : ఈ నెల 22వ తేదీన హనుమకొండలో నిర్వహించనున్న ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఓటర్ల జాబితా సవరణ అవగాహన సదస్సును విజయవంతం చేయాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పార్టీ నాయకులు, బూత్ స్థాయి ప్రతినిధులకు పిలుపునిచ్చారు. ఈ సదస్సుకు ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు ఏఐసీసీ, టీపీసీసీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు హాజరుకానున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.గురువారం హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ అత్యంత కీలకమైందని, ఈ ప్రక్రియలో నిర్లక్ష్యం వహిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) కీలక బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ప్రతి ఓటరు వివరాలు సక్రమంగా నమోదు కావడం, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చూడడం, అక్రమాలు చోటుచేసుకోకుండా పర్యవేక్షించడం వంటి అంశాల్లో బీఎల్‌ఏల పాత్ర ఎంతో ముఖ్యమని చెప్పారు. ఈ నెల 22న జరగనున్న అవగాహన సదస్సుకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని అన్ని బూత్‌లకు చెందిన బీఎల్‌ఏలు తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన సూచించారు. సదస్సులో ఓట్ల సవరణ ప్రక్రియకు సంబంధించిన విధివిధానాలు, ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, బీఎల్‌ఏల బాధ్యతలపై సమగ్ర అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఏఐసీసీ, టీపీసీసీ నాయకుల పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్,టీపీసీసీ జనరల్ సెక్రటరీ లు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,ఈ వి శ్రీనివాస్ రావు,టీపీసీసీ మెంబర్ బత్తిని శ్రీనివాస్ రావు,కుచన రవళి,జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ అరూరి సాంబయ్య మరియు మాజీ కార్పొరేటర్లు,డివిజన్ అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు






