సాయికృష్ణ ఉదంతం కలకలం: గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు

by Vemula.Srinu Prasad |

వైసీపీ కార్యకర్త, రౌడీషీటర్ సాయికృష్ణ ఉదంతం ప్రభుత్వ హత్యలా కనిపిస్తోందని ఆ పార్టీ భావిస్తోంది. విచారణ జరిగితేనే అసలు విషయాలు బయటకు వస్తాయని డిమాండ్ చేస్తోంది..

సాయికృష్ణ ఉదంతం కలకలం: గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ కార్యకర్త, రౌడీషీటర్ సాయికృష్ణ ఉదంతం ప్రభుత్వ హత్యలా కనిపిస్తోందని ఆ పార్టీ భావిస్తోంది. విచారణ జరిగితేనే అసలు విషయాలు బయటకు వస్తాయని డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఎమ్మెల్సీ బొత్స ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం లోక్‌భవన్‌లో గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిశారు. ఐదు అంశాలపై ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీపై సీబీఐతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. డీఎస్సీలోని 5 అంశాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించింది.

మెరిట్ లిస్ట్ చూపకుండానే ఉద్యోగాలు

మరోవైపు మెరిట్ లిస్ట్ విడుదల చేయకుండా ఉద్యోగాలు ఎలా ఇచ్చారని ఆ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. స్పోర్ట్స్ కోటా నుంచి ప్రశ్నాపత్రాల వరకూ అవకతవకలు జరిగాయన్నారు. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని బొత్స డిమాండ్ చేశారు. డీఎస్సీపై లోకేశ్ వ్యాఖ్యలు బాధ్యతారహిత్యంగా ఉన్నాయన్నారు. సాయికృష్ణ ఘటన ప్రభుత్వ హత్యలా కనిపిస్తోందని, తక్షణమే బాధ్యులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అసలు విషయాలు బయటకు రావాలంటే స్వతంత్ర విచారణ తప్పనిసరి బొత్స వ్యాఖ్యానించారు.

Next Story