- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ వ్యాప్తంగా భూ క్రయ విక్రయాలకు బ్రేక్
రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు భూ క్రయ విక్రయాలకు బ్రేక్ పడనున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు భూ క్రయ విక్రయాలకు బ్రేక్ పడనున్నది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన వెబ్‌సైట్, అనుబంధ ఆన్‌లైన్ సేవలు షెడ్యూల్ చేసిన సర్వర్ నిర్వహణ పనుల కారణంగా తాత్కాలికంగా అందుబాటులో ఉండవని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. సుమారు ఐదేళ్ల తర్వాత చేపడుతున్న ఈ సర్వర్ నిర్వహణ పనుల ద్వారా సర్వర్ వ్యవస్థలు మరింత సజావుగా పనిచేయడం, భద్రతా ప్రమాణాలు బలోపేతం కావడం, సేవల నాణ్యత మెరుగుపడడం కోసం ఈ తాత్కాలిక విరామం అవసరమన్నారు. జూన్ 26న మొహర్రం, జూన్ 28న ఆదివారం ప్రభుత్వ సెలవు దినాలు కావడంతో మధ్యలో ఉన్న జూన్ 27న ఒక్కరోజు మాత్రమే ప్రభుత్వ పని దినంలో రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం కలుగుతుందన్నారు. దీంతో సాధారణ ప్రజలకు కలిగే అసౌకర్యం అత్యల్పంగా ఉండేలా ఈ షెడ్యూల్ రూపొందించామన్నారు. ప్రజలు తమ రిజిస్ట్రేషన్ సంబంధిత పనులను ముందస్తుగా ప్రణాళిక చేసుకోవాలన్నారు. ఈ నెల 29వ తేదీ నుంచి అన్ని సేవలు యథావిధిగా పునఃప్రారంభమవుతాయని ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడించారు. శాఖ నిర్వహణ పనులకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.






