ఆదివాసీ అస్తిత్వం చాటే విధంగా జాతర: మంత్రి సీతక్క

by Malleboina Mahesh |

ఆదివాసీల అస్తిత్వాన్ని ప్రపంచానికి చాటే విధంగా మేడారం మహా జాతరను నిర్వహిస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు.

ఆదివాసీ అస్తిత్వం చాటే విధంగా జాతర: మంత్రి సీతక్క
X

దిశ, మేడారం నెట్ వర్క్: ఆదివాసీల అస్తిత్వాన్ని ప్రపంచానికి చాటే విధంగా మేడారం మహా జాతరను నిర్వహిస్తున్నట్లు మంత్రి సీతక్క (Minister Sitakka) తెలిపారు. బుధవారం ఐ అండ్ పీఆర్ (I& PR), జిల్లా డీపీఆర్వో సంయుక్త ఆధ్వర్యంలో మీడియా సెంటర్‌ (Media Center)లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ముద్రించిన సుమారు 1000 టీ షర్టులను మంత్రి సీతక్క మేడారం జాతర కవరేజీ లో ఉన్న మీడియా, ప్రెస్ మిత్రులకు అందజేశారు. కార్యక్రమంలో ఐ అండ్ పీఆర్ అడిషనల్ డైరెక్టర్, జగన్, డిప్యూటీ డైరెక్టర్ వై. వెంకటేశ్వర్లు, వెంకట సురేష్, డీపీఆర్వో రఫీ, ఇంజనీరింగ్ విభాగం అధికారులు భూపాల్ , కొండయ్యలు పాల్గొన్నారు.

Next Story